19 June, 2026 | 6:26 PM

అనగారిన వర్గాల ప్రజల కోసం రాహుల్ గాంధీ పోరాటం

19-06-2026 04:42 PM

బోథ్,(విజయక్రాంతి): అణగారిన వర్గాల సంక్షేమం కోసం వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ పార్లమెంటులో పలుమాలు ప్రస్తావించిన మహా నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.