ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీర శ్యాం నాయక్, డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రేమ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు.
Bharat Jodo Yatra ద్వారా దేశ ప్రజలను ఏకం చేస్తూ యువత, రైతులు, కార్మికులు, మహిళల సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించారని కొనియాడారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజా నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.రాహుల్ గాంధీ దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించే శక్తి కలిగిన నాయకుడని, ఆయన ఆశయాల సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.






