19 June, 2026 | 4:56 PM

ఈ నెల 21న మల్కారంలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం

19-06-2026 04:09 PM

హాజరుకానున్న మంత్రి తుమ్మల

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని మల్కారం గ్రామంలో పార్టీలకు అతీతంగా పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 21వ తేదీ, ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పామాయిల్ రైతులు, తుమ్మల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయిల్ పామ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు.