19 June, 2026 | 5:22 PM

చర్లలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

19-06-2026 04:00 PM

మండల  కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కటింగ్, మిఠాయి పంపిణీ

చర్ల,(విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.  మండల అధ్యక్షులు  విజయ్ నాయుడు  ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీ జనరల్ సెక్రటరీ  నల్లపు దుర్గాప్రసాద్ , జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత సాధికారత, దేశాభివృద్ధికి చేస్తున్న కృషిని నేతలు కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.