calender_icon.png 7 February, 2026 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి సీతక్కకు రాఘవేందర్ రెడ్డి ఘన స్వాగతం

07-02-2026 07:24:59 PM

బడంగ్ పేట్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్న మంత్రి సీతక్కకు ఏఐసిసి విచార్ విభాగ్ కో ఆర్డినేటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. శనివారం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి, ఎంపి చామల కిరణ్ రెడ్డితో కలిసి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్న మంత్రి సీతక్కను బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డితో కలిసి, బిఎన్ రెడ్డి నగర్ దగ్గర ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్న మంత్రి సీతక్కను కలిసి శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్చం అందజేసి ఘన స్వాగతం చెప్పినట్లు చెప్పారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో జరిగిన పలు సమావేశాల్లో సీతక్క పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని మున్సిపాలిటిలలో విజయ డంక మోగిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.