calender_icon.png 8 February, 2026 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి నాయకులను ఎన్నుకోండి

07-02-2026 07:29:48 PM

 మున్సిపాలిటీలు అభివృద్ధి చెందడానికి దోహదపడండి

కలెక్టర్ హనుమంత రావు

ఆలేరు,(విజయక్రాంతి): మున్సిపాలిటీ లు అభివృద్ధి చెందాలంటే వార్డుల కోసం పాటుపడే నాయకులని ఎన్నుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. శనివారం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో ఆర్డిఓ కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో డిఆర్డిఓ నాగిరెడ్డి, భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో అడిషనల్ డిఆర్డిఓ సురేష్, పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో తహసిల్దార్ శ్రీనివాస్, కమిషనర్ అంజన్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్డీవో శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లతో తమ ఓటును డబ్బుకు ,మద్యానికి, ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా నిజయమైన , ఒక మంచి వార్డు మెంబర్ ను ఎంచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కుప్రజాస్వామ్య పునాది అని, ఓటరు గా నమోదు అయిన ప్రతీ ఒక్కరు ఓటు వేయాలన్నారు. ఓటు హక్కు వినియోగం, అవగాహన ర్యాలీలు చేయడం వలన మార్పు వస్తుందన్నారు.

ఇప్పుడు విద్యార్థుల కావొచ్చు కానీ రాబోయే రోజుల్లో విద్యార్థులందరూ ఓటర్ లు అవుతారన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకోవడం వలన వార్డుల అభివృద్ధిలో ముందు వుంటాయని తెలిపారు. మీరు మీ వార్డులలో కూడా మా ఓటుని అమ్ముకోము స్వచ్ఛందంగా ఓటుని వినియోగించుకుంటాం అని బోర్డులు ఏర్పాటు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.