300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
07-08-2026 01:37 AM
కోహిర్ (జహీరాబాద్), ఆగస్టు 6 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కోహీర్ పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుజరాత్కు లారీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారంతో లారీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేసి పట్టుబడిన బియ్యాన్ని దిగ్వాల్లోని పౌరసరఫరాల గోదాంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బియ్యం మాఫియా అసలు సూత్రధారుల కోసం పోలీసుల దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.






