7 August, 2026 | 5:24 AM

ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయం

07-08-2026 01:35 AM

ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం పటాన్చెరు పట్టణం లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నంతా అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, సీనియర్ నాయకులు యాదగిరి యాదవ్, విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, శ్రీధర్ చారి, అశోక్, వెంకటేష్, షకీల్, ధనరాజ్ గౌడ్, రామ్మోహన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.