టీఆర్పీతోనే రాజకీయ, సామాజిక న్యాయం
- పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజినికుమార్ యాదవ్
- ఘనంగా పెద్దపల్లి జిల్లా టీఆర్పీ కార్యాలయం ప్రారంభం
- తెలంగాణ రాజ్యాధిక పార్టీలో చేరిన పలు పార్టీల నేతలు
పెద్దపల్లి, ఏప్రిల్ 3(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) పెద్దపెల్లి జిల్లా కార్యాలయం శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్ మాధం రజినికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర సెక్రటరీ అఖిల్ పాషా, సోషల్ మీడియా సౌత్ తెలంగాణ కన్వీనర్ మార్త శ్రీనివాస్, నూతన జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్‌తో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు మెరుగు చందర్ యాదవ్ అధ్యక్షతలో పెద్దపల్లి జిల్లాలోని పలు పార్టీ నాయకులు టీఆర్పీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్ టీఆర్పీలో చేరిన నాయకులందరికీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రజిని కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎవరెంతో వారికంత అనే సిద్ధాంతంతో మా పార్టీ ముందుకు సాగుతోంది. బీసీలపై జరుగుతు న్న అన్యాయాలు, అవకతవకాలు చూసి తట్టుకోలేక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయక త్వంలో ఈ పార్టీ ఆవిర్భవించిందన్నారు.
మైనారిటీలకు నిజమైన రాజకీయ, సామాజిక న్యాయం కేవలం తెలంగాణ రాజ్యాధికార పా ర్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్నారు.పెదపల్లి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి నూత న జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ నాయకత్వంలో తీవ్రంగా కృషి చేయాలని సూ చించారు.
పార్టీ రాష్ట్ర సెక్రటరీ అఖిల్ పాషా మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయం చూసి తట్టుకోలేక తీన్మార్ మల్లన్న నేతృత్వంలో పుట్టింది అన్నారు. బీసీలకు నిజమైన రాజ్యాధికారం అందించే ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. కార్యక్రమం లో టీఆర్పీ పెద్దపల్లి జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




