4 April, 2026 | 4:53 AM

న్యాయవ్యవస్థకు బలగం, బలం ఉద్యోగులే

04-04-2026 01:27 AM
  1. న్యాయవ్యవస్థకు బలగం, బలం ఉద్యోగులే.. జిల్లా జడ్జి భారత లక్ష్మీ 
  2. రోజు పైళ్లతో కుస్తీ పట్టేది మీరే 
  3. కోర్టు కేసుల కనికట్టును కనిపెట్టేది మీరే
  4. జ్యూడిషియల్ ఉద్యోగుల సంఘo ప్రమాణ స్వీకారం 

నిజామాబాద్, లీగల్ కరెస్పాండెంట్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): న్యాయవ్యవస్థకు వెన్నుముఖగా నిలిచేది ఉద్యోగులేనని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు. కోర్టు కేసుల దస్త్రాలకు దారి చూపేది మీరెనంటు ఆమె కోర్టు సిబ్బందిని ఉద్దేశించి ప్రశంశించారు. తెలంగాణ రాష్ట్ర జుడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా యూని ట్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు.

జిల్లాకోర్టు సముదాయం లోని సమావేశపుహల్ అన్ని సమావేశాలకు, సెమినార్లకు, సదస్సులకు వేదిక అవుతూ ప్రమాణస్వీకరానికి పెద్దపీఠ వేసిందని ఆమె కొనియాడారు. ఒక దిక్కు ఉద్యోగ బాధ్యతలు మరొక దిక్కు సంఘ అదనపు బాధ్యల బరువును భుజాన వేసుకున్న నూతన సంఘ బాద్యులను ఆమె ప్రశంశించారు. కోర్టులలో దాఖలు అయ్యే ప్రతి పైళ్ల పేపర్లను పదిలంగా కాపాడేది ఉద్యోగ వర్గమేన న్నారు.

న్యాయవాదుల, న్యాయార్థుల సంశయాలను తీర్చు తూ కేసుల కదలికలను ముందుకు నడిపించడానికి చోధకశక్తులు ఉద్యోగులేనని ఆమె పేర్కొన్నారు. జ్యూడిషియారీ ఒక కుటుంబమని, ఒక పండుగలా ప్రమాణస్వీకారం జరుపుకోవడం ఆనందదాయాకమని ఆమె తెలిపారు. ఉద్యోగులంతా ఇప్పటిలాగే కలిసిమెలిసి విధులు నిర్వహిస్తు జిల్లా యూనిట్ కు రాష్ట్రంలో మరింత మంచిపేరు తీసుకురావాలని జిల్లాజడ్జి భారత లక్ష్మీ కోరారు.

జ్యూడిషియారీ ఉద్యోగుల అసోసియేషన్ నూతన అధ్యక్షుడు డి. ప్రకాష్, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి ప్రసంగిస్తూ గతంలో ఉద్యోగ నేతల వారసత్వాన్ని కొనసాగిస్తూ, న్యాయ వివాదాలను పరిష్కరింప జేయడంలో తమవంతు కృషి కొనసాగుతుందన్నారు. సంఘ కార్యవర్గ సభ్యులు లత, వినోద్, శ్రీనివాస్ రెడ్డి, కవిత, బలరామ్, నవీన్,రాకేష్  పాల్గొన్నారు.

నూతన ఆపీస్ బేరర్స్..

తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిజామాబాద్ యూని ట్ అధ్యక్షుడుగా డి. ప్రకాష్, ఉపాధ్యాక్షులు గా నాగేందర్ రావు, నరోత్తమ్ రెడ్డి, సునీత, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, కోశాధికారి ఎమ్. ఎ రషీద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి స్వరూప రాణి, సంయుక్త కార్యదర్శులు సయ్యద్ ఇర్షాద్ భుఖారి, హేమంత్ కుమార్, ఎమ్. జ్యోతి, కార్యాలయ కార్యదర్శి మహమ్మద్ అజారొద్దీన్, క్రీడాకార్యదర్శులు లింగారెడ్డి, మనీష్ భట్, మహిళ ప్రతినిధులు బాలందిన, శకుంతల, సుజాత, సంస్కృతిక కార్యదర్శులు రమాదేవి, స్రవంతి లు ప్రమాణ స్వీకారం చేశారు.