13 April, 2026 | 3:15 AM

అవినీతిపై ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు

13-04-2026 01:33 AM
  1. సీబీఐ విచారణ కోరడంతో కేసులు పెడుతున్నారు

మంత్రి సీతక్క ఇలాంటి భాష వాడటం తగదు

స్కాంపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిషాంక్ డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాం తి): ప్రజల డబ్బుతో జరిగిన భారీ అవినీతి ఆరోపణలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిషాంక్ స్పష్టంచేశారు. అంగన్వాడీ మొబైల్ స్కాంపై సీబీఐ విచారణ కోరినందుకు కేసులు పెట్ట డం ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలులో రూ.383.10 కోట్ల స్కాం ఆరోపణలపై రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ వ్యవ హారంలో సీబీఐ విచారణ కోరిన బీఆర్‌ఎస్ నాయకుడిపై ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది.

ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క చేసిన ‘చెప్పు తెగుద్ది’ అన్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ తీవ్రంగా స్పందించారు. నిజం బయటకు రాకూడదనే భయంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది అని ఆరోపించారు. మంత్రి సీతక్క వ్యాఖ్యలను ఖండిస్తూ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలాంటి భాష వాడటం తగదని హితవుపలికారు.

ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన ప్రభు త్వం, విమర్శలను అణచివేయడానికి పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తోందని విమర్శించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ కొనుగో ళ్లలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌చేశారు. నిజాలు వెలుగులోకి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.