15-02-2026 01:30:00 AM
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు యంగ్ డైరెక్టర్ రతన్ రిషి. గతంలో ‘ఉత్తర’, ‘ఆర్టిస్ట్’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం మూడో చిత్రంగా హీరోయిన్ సెంట్రిక్ కథను చెప్పబోతున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్లుగా నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
‘క్వీన్‘ అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమా గ్లింప్స్.. ప్రస్తుత సమాజంతో ముడిపడి ఉన్న ఒక ఆసక్తికరమైన ప్రేమకథను ఆవిష్కరించింది. ‘రాళ్లమీద పేర్లతో కొన్ని ప్రేమకథలు మిగిలిపోతాయి. తాజ్‌మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమకథలు మిగిలిపోతాయి. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమకథ’ అంటూ సాగే గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుం టున్న ఈ సినిమాకు సంగీతం: యతీశ్; డీవోపీ: సరస్; ఆర్ట్: భార్గవ నౌండ్ల; ఎడిటింగ్: ఆర్‌ఎం విశ్వనాథ్ కుచనాపల్లి.