నాణ్యత ప్రమాణాలు పాటించాలి
మినరల్ వాటర్ ప్లాంట్లలో ఆకస్మిక తనిఖీలు
సిఐ బాలాజీ వరప్రసాద్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణంలోని మినరల్ వాటర్ ప్లాంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణ పరిధిలో ఉన్న 13 మినరల్ వాటర్ ప్లాంట్లను సీఐ బాలాజీ వరప్రసాద్ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఈ తనిఖీలు జిల్లా ఎస్పీ నితిక పంత్, ఏఎస్పీ చిత్తరంజన్ ఆదేశాల మేరకు చేపట్టినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ప్రతి ప్లాంట్‌లో లైసెన్స్‌లు, నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు.
మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహించాలంటే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ లేకుండా ప్లాంట్ నడిపితే వాటిని సీజ్ చేసి నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నాణ్యత ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.




