22 July, 2026 | 2:37 AM

ప్రభుత్వ సేవల నాణ్యతే లక్ష్యం

22-07-2026 02:06 AM

కమాన్ పూర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 

పెద్దపల్లి, జూలై 21(విజయ క్రాంతి) ప్రభు త్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించేందుకు అన్ని శా ఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కమాన్పూర్, రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ విద్య, వైద్యం, రెవెన్యూ, ఓటరు నమో దు, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

గుండారం ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించడంతో పాటు ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు పెంపొందించేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించి విద్యా ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు.

కమాన్పూర్లో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి 2026 ఆగస్టు 1 నుంచి కొత్త భవనం నుంచే సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు.మండలంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎన్యూమరేషన్ ఫారాల డిజిట లైజేషన్ను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి దశలో కచ్చితత్వం పాటించాలని అధికారులకు స్ప ష్టం చేశారు.

పెంచికల్పేట్ గ్రామంలోని సింగరేణి భూములను పరిశీలించిన కలెక్టర్, భూ వివాదాల పరిష్కారం కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌ఆధ్వర్యంలో సమగ్ర సర్వే చేపట్టి సమ స్యలను పరిష్కరించాలని సూ చించారు. క మాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ లేబర్ రూమ్, వ్యాక్సినేషన్ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి పనితీరు మెరుగుపడి ప్రజలకు నా ణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ఓపీ సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

సీజనల్ వ్యాధుల నియంత్రణ, స్టాప్ డయేరియా, ఎన్సీడీ కార్యక్రమాలను ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా అమలు చే యాలని సూచించారు. రామగిరి మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన తహసీ ల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మేడిపల్లి గ్రామ శివారులో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్ని పరిశీలించి ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూ ర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో కమాన్పూర్ తహసీల్దార్ వాసం తి, రామగిరి తహసీల్దార్ సుమన్, ఎంపీడీఓ శైలజారాణి తదితరులు పాల్గొన్నారు.