విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి..
తాడ్వాయి, జూలై 21 (విజయ క్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులు సూచించారు.విజయ క్రాంతి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన మధ్యాహ్న భోజనంలో పురుగులు అనే వార్తకు అధికారులు స్పందించారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంపీడీవో భరత్ కుమార్, తహాసిల్దార్ శ్వేత, ఎన్ఫోర్స్మెంట్ డీటీ తిరుపతిలు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరారు. బియ్యంలో పురుగులు,ఇసుక వచ్చిన సమయంలో వాటిని తొలగించి శుభ్రంగా కడిగి విద్యార్థులకు భోజనాన్ని అందించాలన్నారు. బియ్యాన్ని పరిశీలించి బియ్యంలో లక్క పురుగులు ఉన్నాయని వాటిని తొలగించాలన్నారు. పాత్రలను శుభ్రంగా కడిగి విద్యార్థులకు ఇబ్బందులు కలగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి గిర్మబోయి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






