ఆగస్టులో హాయ్
22-07-2026 02:28 AM
నయనతార, యువ హీరో కవిన్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ‘హాయ్’. నూతన దర్శకుడు విష్ణు ఎడ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నయనతార, విఘ్నశ్ శివన్, ఎస్‌ఎస్ లలిత్‌కుమార్ నిర్మాతలు.
ఇందులో కే భాగ్యరాజ్, ప్రభు, రాధిక శరత్‌కుమార్, వీటీవీ గణేశ్, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 14న విడుదల చేయనున్నట్టు ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా వెల్లడించారు.






