13 August, 2026 | 3:04 AM

గురుకులాలతో నాణ్యమైన విద్య

13-08-2026 12:33 AM

నిర్మల్ ఆగస్టు 1౨ ( విజయ క్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించిన తెలంగాణ గురుకుల తోనే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని బీఆర్‌ఎస్వీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు అన్నారు. నిర్మల్ పర్యటనకు వచ్చిన ఆయనకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు మీర్జా యా సిన్ సన్మానం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన గురుకులల్లో వేలాది మంది విద్యార్థులు కార్పొరేట్ విద్యను చదువుతున్నారని గుర్తు చేశారు. అటువంటి గురుకులాలు ప్రభుత్వం పరిరక్షించుకోవాలని సూచించారు. గురుకుల పాఠశాలలో ప్రభుత్వం మౌలిక సదుపాయా లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.