29 May, 2026 | 8:02 PM

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

29-05-2026 05:06 PM

మగ్ధుంపూర్‌లో బడిబాట..

నంగునూరు,(విజయక్రాంతి): పిల్లల భవిష్యత్తుకు ఉజ్వల పునాది వేసే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని మగ్దుంపూర్ సర్పంచ్ పాకాల శ్రీనివాస్ కోరారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండారు ప్రసాద రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో ముందస్తు బడిబాట నిర్వహించారు.ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను వివరించారు.ప్రభుత్వ బడుల్లో అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతుందని, దీనివల్ల వేల రూపాయల ఫీజులు ఆదా అవుతాయన్నారు.ఉచితంగా పుస్తకాలు,యూనిఫాంలతో పాటు అల్పాహారం,మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింలు, విజయలక్ష్మి, లీల, కృష్ణవేణి పాల్గొన్నారు.