30 July, 2026 | 1:25 PM

బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

30-07-2026 01:00 PM

కుబీర్ (విజయ క్రాంతి): ముధోల్ మండలంలోని గన్నోర గ్రామంలో, బాసర మండలంలోని కౌట మాజీ ఎంపీపీ బాబురావు కుటుంబాన్ని గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్(Rama Rao Pawar) పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.