18 May, 2026 | 3:14 AM

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

18-05-2026 02:14 AM

జిల్లా కలెక్టర్ కె. హరిత 

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,మే 17(విజయ క్రాంతి):ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక- 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా విజయోత్సవ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి లలిత,జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కామ్డే అనిల్ కుమార్, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ లతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యార్థులు కష్టపడి చదివి ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రభుత్వ-స్థానిక సంస్థల ఉన్నత పాఠశాలల నుండి 10వ తరగతిలో జిల్లా టాపర్లుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులకు,క్రీడలలో జాతీయ స్థాయిలో పాల్గొన్నటువంటి ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి 10వేల రూపాయలు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అలీ బిన్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ అహ్మద్, , ఏ సి జి ఈ జనార్ధన్, జిల్లా క్వాలిటీ కో-ఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, కో-ఆర్డినేటర్లు లతీఫ్, శాంతి కుమార్, భాగ్యలక్ష్మి, మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ సుభాష్, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.