calender_icon.png 10 February, 2026 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలి

10-02-2026 12:53:40 AM

ఖానాపూర్, ఫిబ్రవరి ౯ (విజయక్రాంతి): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషకాహారం అందించాల్సిందిగా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ అధికారులను ఆదేశించారు. మంగళవారం దస్తురాబాద్, కడెం గిరిజన ఆశ్రమ బాలి కల పాఠశాల, కడెం (బాలూరు) గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్య, వైద్యం, భోజన ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థులతో ముచ్చటించి భోజన నాణ్యత, సమయపాలనపై ప్రశ్నించారు. వండిన ఆహారాన్ని పరిశీలించి కంప్యూటర్ ల్యాబ్ను తనిఖీ చేశారు. కడెం ఆశ్రమ పాఠశాలలో 170 మంది విద్యార్థుల్లో 115 మంది మాత్రమే హాజరై ఉండగా, హాజరు నమోదు తప్పుడు విధంగా చేయడంపై వార్డెన్ను హెచ్చరించారు.

దస్తురాబాద్ పాఠశాలలో పల్స్ యాప్ అప్డేట్ చేయకపోవడం, నెట్వర్క్ కారణాలు చూపడం, తక్కువ మోతాదులో భోజనం అందించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పల్స్ యాప్ పనితీరుపై సమీక్షించి, సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.