4 March, 2026 | 5:19 AM

స్వదేశానికి క్షేమంగా పీవీ సింధు

04-03-2026 12:00 AM

బెంగళూరు, మార్చి, ౩ : ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్థితులతో దుబాయ్‌లో చిక్కుకు న్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్వదేశానికి క్షేమంగా చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సింధు లండన్ వెళ్లాల్సి ఉండగా.. గల్ఫ్ దేశాల్లో తాజా పరిస్థితితో విమానాలు రద్దయ్యాయి. దీంతో దుబాయ్‌లోనే సింధు, ఆమె సిబ్బంది చిక్కుకపోయారు.

సింధు బస చేసిన ప్రాంతానికి సమీపంలోనే భారీ పేలు డు కూడా జరగడంతో ఆందోళన నెలకొంది. స్థానిక ఎంబసీ అధికారుల సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినప్పటకీ విమానాల రద్దు, ఇతర ఆంక్షల కార ణంగా స్వదేశానికి తిరిగి రావడం సవాల్‌గా మారింది. తాజాగా దుబాయ్ అధికారులు, అక్కడి ఇమిగ్రేషన్ అధికారుల సాయంతో ఎట్టకేలకు సింధు స్వదేశానికి తిరిగి వచ్చింది. దుబాయ్ నుంచి నేరుగా బెంగళూరు చేరుకున్న సింధు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది.

గత కొన్ని రోజు లు తన జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితులుగా అభివర్ణించింది. ప్రస్తుతం తాను సురక్షితంగా ఇంటికి చేరుకున్నానని, ఈ కష్టకాలంలో సహాయం చేసిన దుబాయ్ అధికా రులు,  ఇమిగ్రేషన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. విమానాల రద్దుతో ఆల్ ఇంగ్లాం డ్ టోర్నీకి దూరమైంది. ప్రస్తుతం మానసికంగా ఒత్తి డికి గురయ్యానని, కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి ప్రాక్టీస్ మొదలుపెడతానని సింధు వెల్లడించింది.