విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం
మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన మేడిపల్లి సీఐ
మేడిపల్లి, జూలై 1 (విజయక్రాంతి): మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒమేగా డిగ్రీ కళాశాలలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ జలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది వి ద్యార్థినులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలపై జరిగే వేధింపులు, ఈవ్ టీజింగ్, స్టాకిం గ్, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలు వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూ చించారు.
ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని, అత్యవసర పరిస్థితుల్లో 100 కు కాల్ చేయాలని వివరించారు. మాదకద్రవ్యాల దుష్పరిణామాల గురించి వివరిస్తూ, డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండి మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని సూ చించారు. యూత్ ఫర్ ది నేషన్, నాట్ ఫర్ ఇంటెక్స్ కేషన్ అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీ సులకు తెలియజేయాలని కోరారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, గుర్తు తెలియని ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, ఓటిపిలు, బ్యాంకు వివరాలు, సోషల్ మీడియా మో సాల పట్ల అప్రమత్తంగా ఉండాలని* సూ చించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని, అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.
రోడ్డు భద్రతపై మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించా లని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, అధిక వేగం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ చేయడం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ కృష్ణ, ఎస్‌ఐ రవి, ఒమేగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థినులు, పాల్గొన్నారు.






