ముమ్మరంగా పల్స్ పోలియో
28-06-2026 01:03 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ముమ్మరంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. ఉదయం ఏడు గంటల నుండి 0-5 ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం ప్రారంభించారు. వివిధ చోట్ల అధికారులు, ప్రజా ప్రతినిధులు చంటి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు, పోషకులు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడానికి పల్స్ పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు.






