పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్
26వ డివిజన్‌లో చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
ముకరంపుర,(విజయక్రాంతి): పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా 26వ డివిజన్ కార్పొరేటర్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ స్థానిక సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, టీఎన్‌ఆర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ స్వయంగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.
5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






