జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య
ముకరంపుర,(విజయక్రాంతి): టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు జూలై 2న నిర్వహించనున్న "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్, కవిత సైనికుడు, తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర నాయకుడు చెన్నమల్ల చైతన్య పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులు ఇప్పటికీ సొంత ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడటం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు మల్లారెడ్డి మాట్లాడుతూ 15 ఏళ్లు ఉంటేనే స్థానికత వర్తిస్తుందని అనవసరంగా తెలంగాణ ప్రాంతాన్ని రెండో రాజధానిగా చేసే ప్రయత్నంలో కుట్ర లో భాగమేనని అన్నారు.






