28 June, 2026 | 2:37 PM

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ

28-06-2026 01:43 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 31వ డివిజన్ కాన్పూర్ దుర్గమ్మగడ్డ రోడ్ నెం.11లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 15 లక్షల మునిసిపల్ సాధారణ నిధులతో మంజూరైన పైప్ డ్రైన్, సి.సి. రోడ్ నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఎస్.డి. ముఖద్దర్ హుస్సేన్  31వ డివిజన్ స్థానిక కార్పొరేటర్,కాలనీ పెద్దలు, స్థానిక ప్రజలు, మరియు తదితరులు పాల్గొన్నారు.