28 June, 2026 | 2:37 PM

సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి

28-06-2026 01:32 PM

చింతకాని,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ఈనెల 30న నిర్వహిస్తున్న రైతు ఆశీర్వద సభకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ముఖ్య అతిధిగా హజరవుతున్న తరుణంలో  ఆ బహిరంగ సభా స్థలాన్ని రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పరిశీలించారు. సభాస్ధలంలో ఏర్పాట్లను సహచర శాసన సభ్యులతో కలిసి పరిశీలించారు.

అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రస్తుతం వర్షాలు వస్తున్న తరుణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాలోతు రాందాసు నాయక్, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.