28 June, 2026 | 1:53 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

రెండు చుక్కల పోలియోపై నిరంతర విజయం

28-06-2026 01:07 PM

ఉట్నూర్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం  పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి  మంద మకరందు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉట్నూర్ సర్పంచ్  అనిత, అదనపు వైద్యశాఖ అధికారి డా.కుడిమెత మనోహర్‌తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా

ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొంటూ, గ్రామాలు, తండాలు, దూర ప్రాంతాల్లోని చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.