ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
పాపన్నపేట, మే29: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన 104 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించి, వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపే లక్ష్యంతో ఈ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి చేకూరేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






