శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం
18-05-2026 04:54 PM
55,116 రూపాయలు విరాళం అందజేసిన మద్ది యుగంధర్ రెడ్డి
మేడిపల్లి మే 18 (విజయక్రాంతి); బోడుప్పల్ సర్కిల్ పరిధి మేడిపల్లి లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి పీర్జాదిగూడ మాజీ కార్పొరేటర్ మద్ది యుగoదర్ రెడ్డి 55,116 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణంలో తన వంతు సహాయం అందించడం చాలా సంతోషకరమని, ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. విరాళం అందజేసినందుకు ఆలయ కమిటీ సభ్యులు మద్ది యుగంధర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.






