18 July, 2026 | 6:18 PM

Breaking News

ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •  

పోలీసులకు ప్రజా దర్బార్

18-07-2026 06:12 PM

నిర్మల్,(విజయక్రాంతి): పోలీస్ శాఖలో పనిచేస్తున్న వివిధ ఉద్యోగుల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల శనివారం పోలీస్ దర్బార్ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో పోలీసు ఉద్యోగులతో వారి సమస్యలు కుటుంబ సమస్యలు ఇతర సమస్యలను అడిగారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హోంగార్డులకు, ఏ.ఆర్ కానిస్టేబుల్లతో ముఖాముఖి సమావేశమై వారి విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

సిబ్బంది తమకు ఎదురవుతున్న వివిధ సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురాగా, వాటిని సానుభూతితో విన్న ఎస్పీ సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీసు ఉద్యోగి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగులు,మద్యం, మాదకద్రవ్యాలు వంటి చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. ఎలాంటి వ్యక్తిగత లేదా విధి నిర్వహణ పరమైన ఒత్తిళ్లు పడవద్దని తమ దృష్టికి తేవాలని సూచించారు.