18 July, 2026 | 6:17 PM

Breaking News

ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •  

ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్

18-07-2026 06:15 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ శిబిరాన్ని శనివారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కౌన్సిలర్ అమ్మిరి శెట్టి శ్రావణి రాకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించి బిఎల్ఓల ద్వారా మీకు ఫామ్స్ అందనట్లయితే ఫామ్స్ అంది అట్టి ఫామ్స్ ను బిఎల్ఓలకు అందించని వారు ప్రభుత్వం విధించిన గడువు త్వరలోనే ముగుస్తున్నందున ఈనెల 19న ఆదివారం 12వ వార్డు పరిధిలోని రాజమాత గుడి సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక శిబిరంలో 199 మరియు 200 లకు సంబంధించిన బూతు లెవల్ అధికారులు మీకు అందుబాటులో ఉంటారని, అట్టి ఫామ్స్ ను నింపడానికి వాలంటీర్లు కూడ ఉదయం. 9.30.నుండి 4. గంటల వరకు  అందుబాటులో  ఉంటారని, మీరు వచ్చేటప్పుడు ఓటరుకు సంబంధించిన ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను తీసుకు రావాలని వార్డు కౌన్సిలర్ అమిరిశెట్టి శ్రావణి రాకేష్ కోరారు.