18 July, 2026 | 6:11 PM

Breaking News

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •  

బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు

18-07-2026 06:04 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కుచలాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రావ్య బోనాల పండుగ ప్రాముఖ్యతను వివరించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు గ్రామ దేవతలైన పోచమ్మలకు నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తుందని వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రణధీర్ గ్రామస్తులు పాల్గొన్నారు.మండల విద్యాధికారి మమ్మద్ హుస్సేన్ కార్యక్రమాన్ని తిలకించి ఉపాధ్యాయులను అభినందించారు.