18 July, 2026 | 4:51 PM

అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం

18-07-2026 04:51 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి)పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్ బాలికల  హాస్టల్ లో అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ చేయుటకై ఆసక్తిగల మహిళ అభ్యర్థుల నుండి  దరఖాస్తులు కోరుతున్నట్లు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల విద్యాధికారి  ఆరెపల్లి రాజయ్య శనివారం తెలిపారు,  సుల్తానాబాద్ మండలానికి చెందిన  7వ తరగతి ఉత్తీర్ణత కలిగి,  25 నుండి  55  సంవత్సరాల వయసు గల జనరల్ మహిళా  అభ్యర్థులు  తేదీ: 19.07.2026 నుండి 23.07.2026 సాయంత్రం లోగా టీజీ ఎంఎస్ గ ర్రెపల్లి పాఠశాలలో  తమ దరఖాస్తులుసమర్పించాలని తెలియజేశారు. మరిన్ని వివరాల కొరకు టీజీ ఎంఎస్ గర్రెపల్లి  పాఠశాల ప్రిన్సిపాల్  గోల్డీ బల్బీర్ కౌర్ ని ఈ మొబైల్ నెంబర్ లో ( 9397034734  )  సంప్రదించాలని మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య తెలిపారు.