మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.
18-07-2026 06:06 PM
నేరేడుచర్ల,(విజయక్రాంతి): మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నల్లగొండ అభివృద్ధి ప్రదాత సూర్యపేట శాసనసభ్యులు,గుంటకండ్ల.జగదీష్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పల్లెపంగు నాగరాజు, బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రాపోలు నవీన్ కుమార్ ల ఆధ్వర్యంలో నేరేడుచర్ల లోని స్పందన జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల చేత ఒక మొక్కని నాటి,కేక్ కట్ చేసి జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.






