18 July, 2026 | 4:49 PM

సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి

18-07-2026 04:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆయా వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బూతు లెవెల్ అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్న సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియను మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరిశీలించారు. పట్టణంలోని మదీనా కాలనీ మార్కెట్ గల్లి వార్డుల్లో సందర్శించి సమగ్ర ఓటర్ల జాబితా సర్ ప్రక్రియ అమలు తీరును క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పూట హక్కు కల్పించి అనారత ఉన్న ఓటర్లను తొలగించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్. సింగిల్ బిండ చైర్మన్ రమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పూలస మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.