24 June, 2026 | 1:43 AM

డంపింగ్‌యార్డ్‌తో ప్రజారోగ్యం నాశనం

24-06-2026 12:46 AM
  1. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ
  2. డంపింగ్‌యార్డ్ మూయించాలని ప్రజాభవన్‌లో వినతి         

జవహర్‌నగర్, జూన్ 23 (విజయక్రాంతి): పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని నాశనం చేస్తున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను వెంటనే మూసి వేయించండని, హైదరాబాద్ ఘన వ్యర్ధాలను సుదూర ప్రాంతాలకు తరలించాలని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం ప్రజా భవన్ లో  ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా స్పందించిన చిన్నారెడ్డి వెంటనే మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలను సావధానంగా విన్న చిన్నారెడ్డి ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో  పోరాట కమిటీ చైర్మన్ కన్వీనర్లు షేక్షావలి, ఉమా మహేష్, కమిటీ సభ్యులు శివ బాబు ఐఎఫ్టియు, మేకల కావ్య మాజీ మేయర్, మేక లలిత యాదవ్, ప్రఫుల్ రాంరెడ్డి వివిధ పార్టీ ల నాయకులు  పాల్గొన్నారు.