17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు పర్యవేక్షణ

12-02-2026 02:27 AM

మరిపెడ, ఫిబ్రవరి 11(విజయక్రాంతి)జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మరిపెడ మున్సిపల్ పట్టణంలో ఏర్పాటు చేసిన వార్డుల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ స్వయంగా సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన పటిష్ట పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పోలింగ్ అధికారులతో, సిబ్బందితో మాట్లాడి అక్కడున్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మాట్లాడుతూ ఎన్నికల వేళ భద్రతా వ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

న్నికల నిర్వహణలో పాల్గొంటున్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.శాంతియుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు పోలీసులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ స్పష్టం చేశారు.ఈ పర్యవేక్షణలో ఏ ఆర్ డి ఎస్ పి విజయ్ ,మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్, మరిపెడ సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్ర రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.