4 July, 2026 | 10:35 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

అగ్నిభద్రతపై ప్రజల్లో అవగాహన కీలకం

15-04-2026 01:12 AM

అగ్నిమాపక సేవల వారోత్సవం ప్రారంభం 

సంగారెడ్డి, ఏప్రిల్ 14 : అగ్నిమాపక సేవల వారోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అగ్ని భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం జరిగిన వారోత్సవ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా పలు ప్రదేశాల్లో మాక్ డ్రిల్లులు, అవగాహన ర్యాలీలు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

ప్రజలు అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 1944 సంవత్సరంలో బాంబే నగరంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో వీరమరణం పొందిన అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవంను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, ఫంక్షన్ హాళ్లు, సినిమా థియేటర్లు, మాల్స్, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో మాక్ డ్రిల్లులు చేపట్టనున్నట్లు తెలిపారు.

మంగళవారం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్  నిర్మల జగ్గారెడ్డి, పటాన్చేరు ఎమ్మెల్యే  మహిపాల్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే  సంజీవ రెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్  ఉమా హారతి, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అగ్నిమాపక సేవల వారోత్సవాల పాంఫ్లెట్లు, పోస్టర్లను ఆవిష్కరించి వారోత్సవాన్ని ప్రారంభించారు.

గత సంవత్సరం (2025)లో సంగారెడ్డి జిల్లాలో మొత్తం 576 అగ్ని ప్రమాదాలు సంభవించగా, అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి వాటిని అదుపులోకి తెచ్చారని ఆయన తెలిపారు. ఈ ప్రమాదాలలో సుమారు రూ. 5.08 కోట్ల ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, సుమారు రూ. 5.09 కోట్ల విలువైన ఆస్తిని రక్షించడంతో పాటు 63 మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ఈ వారోత్సవాన్ని విజయవంతం చేయడానికి జిల్లా ప్రజలందరూ సహకరించవలసిందిగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.నాగేశ్వరరావు కోరారు.