14 August, 2026 | 5:11 PM

శ్రావణమాసంలో దేవాలయాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించండి

14-08-2026 04:04 PM

మున్సిపల్ కమిషనర్ కు బిజెపి నేతల వినతి

తాండూరు,(విజయక్రాంతి): హిందువుల పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా పట్టణంలో ఉన్న దేవాలయాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వికారాబాద్ జిల్లా తాండూరు భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు నాగారం మల్లేశం, అంతారం కిరణ్ కుమార్, శ్రీధర్, నాయకులు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించారు. దేవాలయాల వద్ద పారిశుధ్యం, వీధిదీపాలు, తాగునీటి ఏర్పాట్లు చేయాలని.. దేవాలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు