calender_icon.png 19 February, 2026 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణ అభివృద్ధికి సలహాలు ఇవ్వండి

19-02-2026 01:16:23 AM

నిర్మల్ మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పల అనురాధ

నిర్మల్, ఫిబ్రవరి ౧౮ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఉద్యోగులుగా సలహాలు ఇవ్వాలని మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల అనురాధ, వైస్ చైర్మన్ అప్పల చక్రవర్తి అన్నారు. బుధవారం జిల్లా టీఎన్‌జీవో అధ్యక్షులు వెల్మల ప్రభాకర్ ఆధ్వర్యంలో నూతనం గా నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అప్పాల గణేశ్ చక్రవర్తిని కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్ పట్టణ అభివృద్ధిలో , ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జిల్లా అధ్యక్షులు సంద అశోక్ టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి కూడాల రవికుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, కోశాధికారి భీమ సురేందర్, ఉపాధ్యక్షులు నవీన్ కుమార్, టి. స్రవంతి , ఎస్. మోహన్ రెడ్డి, కె ఆనం ద్, గోదావరి  , శ్రీదేవి, వెంకట్ రమణ, డి .రాములు జానీ, AEO ల సంఘం అధ్యక్షులు ఎండపెల్లి అశోక్ కుమార్ అటవీశాఖ  ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నరేష్ కుమార్  నీటి పారుదల శాఖ టి శ్రీకాంత్ సత్యనారాయణ గౌడ్ వీరలక్ష్మి నిహారిక రాధా అరుణ్ సతీష్ పల్లవి శ్రీధర్  తిరుపతి  వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.