calender_icon.png 19 February, 2026 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ కబంధహస్తాల నుంచి కాగజ్‌నగర్ విముక్తి

19-02-2026 01:14:50 AM

ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్‌బాబు

కాగజ్‌నగర్, ఫిబ్రవరి18(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ కబంధహస్తాల నుంచి కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి విముక్తి కల్పించామని ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్‌బాబు అన్నా రు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికల్లో పార్టీలు, వ్యక్తులు చూడకుండా బిఆర్‌ఎస్‌కు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చినట్లు చెప్పారు.

తాను అడ్డుగా నిలబడకపోతే మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ చేతికి వెళ్లి గత అరాచకాలు పునరావృతమయ్యేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విశ్వేశ్వరరావు, గజ్జల లావణ్యలక్ష్మణ్, మిట్టపల్లి కమల, మాజీ కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, బాల్కశ్యామ్, కోండ్ర మనోహర్ గౌడ్, ఎలములే మల్లన్న తదితరులు పాల్గొన్నారు.