19-02-2026 01:18:20 AM
కలెక్టర్ కె.హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సం క్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకా లంలో పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. బుధవారం కెరమెరి మండలం మెడి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి హాజరు పట్టికలు, వంటశాల, సరుకుల నిల్వలు, విద్యా బోధన తీరును పరిశీలించారు.
10వ తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసి మంచి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు, పోషకాహారం, పారిశుద్ధ్యంపై అధికారులకు తగిన సూచనలు చేశారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న సామూహిక మరుగుదొడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.