రాహుల్ అరెస్టును ఖండిస్తూ నిరసన ర్యాలీ
ఆత్మకూరు, జూలై 23 : కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రి డా. వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై గొంతెత్తిన ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎండి. రహమతుల్లా, మున్సిపల్ చైర్పర్సన్ జి. నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, డీసీసీ కార్యదర్శి తులసీరాజ్ యాదవ్, మండల అధ్యక్షుడు ఎన్. నాగేశ్వర్తో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






