ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యపై నిరసన
మాగనూరు .ఆగస్టు 21.(విజయ క్రాంతి): నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ కె .రూపా రెడ్డి హత్యను ఖండిస్తూ మాగనూరు మండల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ట్రస్మా ఆధ్వర్యంలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండలం ట్రస్మా గౌరవ అధ్యక్షులు ప్రహ్లాద రెడ్డి మాట్లాడుతూ.. రూపా రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించి హత్య చేసిన విద్యార్థులను చట్టపరముగా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులను క్రమశిక్షణ నైతిక విలువలను పెంపొందించుటకు తల్లిదండ్రులు సహకరించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ వహించి మాదకద్రవ్యాల ఇతర వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాలని వారు కోరారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మధు, వనిత, మహేష్, నరసింహులు, కృష్ణయ్య, వెంకటేష్, ప్రవేట్ పాఠశాలల యాజమాన్యం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






