21 August, 2026 | 7:04 PM

సీఎంటీసీ, జెండర్ రిసర్చ్ సెంటర్‎ను ప్రారంభించిన ఎమ్మెల్యే

21-08-2026 05:55 PM

నేరడిగొండ, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో సీఎంటీసీ, జెండర్ రిసర్చ్ సెంటర్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, యువతకు అవసరమైన సేవలు, పరిశోధన, అవగాహన కార్యక్రమాలకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, అందుబాటులోకి వస్తున్న ప్రతి సదుపాయాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నామని, అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.