21 August, 2026 | 4:34 PM

Breaking News

తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •   ఏఐవైఎఫ్ తాండూర్ మహాసభలను జయప్రదం చేయండి   •  

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా

21-08-2026 03:06 PM

ముకరంపుర, ఆగస్టు 21(విజయక్రాంతి): జీవో 97 ను రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ జీవో వల్ల సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థిని విద్యార్థులు చాలా నష్టపోవాల్సి వస్తుందని ఉపాధి అవకాశాలు పూర్తిగా కోల్పోతారని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో ప్రైవేట్ యూనివర్సిటీలకు విద్యార్థుల భవిష్యత్తు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారాదత్తం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా ముగింపు దశలో విద్యార్థులు ఒకేసారి మూకుమ్మడిగా భారీకేడ్ల  ను దాటి కలెక్టర్ కార్యాలయం లోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని ఆపే క్రమంలో విద్యార్థులకు పోలీసులకు తోపులాట జరిగింది. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో విద్యార్థులను, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలను  అరెస్టు చేసి పోలీస్ శిక్షణ కేంద్రానికి  తరలించారు.