21 August, 2026 | 7:04 PM

రూపారెడ్డి మృతికి నిరసనగా ప్రైవేట్ పాఠశాలల బంద్

21-08-2026 06:04 PM

ఇచ్చోడ, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి మృతికి నిరసనగా శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బంద్ పాటించాయి. రూపారెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఆమెకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి సేవలందిస్తున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రూపారెడ్డి మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు.