హనుమాన్ ఆలయ కలశ పూజలో ఎమ్మెల్యే
21-08-2026 05:59 PM
నేరడిగొండ, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కోర్టికల్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన హనుమాన్ ఆలయ కలశ పూజ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కలశ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మికత, భక్తి మనలో ఐక్యతను, సేవాభావాన్ని పెంపొందిస్తాయన్నారు. గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






